అంతా బాగుంటే డాక్టర్ సాబ్ పెళ్లాన్ని అయ్యేదాన్ని!
on Jun 23, 2022
బుల్లితెరపై ప్రసారం అవుతున్న సీరియల్ `కార్తీక దీపం`. వంటలక్క కారణంగా టాప్ రేటింగ్ తో సాగిన ఈ సీరియల్ గత కొంత కాలంగా ఆ స్థాయిలో మాత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోతోంది. దేశవ్యాప్తంగా టాప్ రేటింగ్ తో రికార్డు సాధించిన ఈ సీరియల్ ఇప్పడు ఫరవాలేదు అనే స్థాయిలో మాత్రమే సాగుతోంది. వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలకు ముగింపు పలికిన దర్శకుడు వాళ్ల పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక వచ్చే కథ నడిపిస్తున్నాడు. ప్రస్తుతం కొత్త తరం జంటలతో ఈ సీరియల్ సాగుతోంది. ఈ గురువారం ఎపిసోడ్ విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం.
ఈ రోజు ఎపిసోడ్ లో జ్వాల ఎమోషనల్ అవుతూ "వెళ్లిపోండి మీ మాటలు అబద్ధం మీరు అబద్ధం" అంటుంది. దీంతో నిరుపమ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అదే సమయంలో చాటు నుంచి చూస్తున్న సౌందర్య "పదవే జ్వాల దగ్గరికి వెళదాం" అంటుంది హిమతో. అయితే హిమ మాత్రం "కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయ్ నానమ్మా" అంటూ ఎమోషనల్ అవుతుంది. పరధ్యానంలో హిమ రోడ్డుపై పడుచుకుంటూ వెళుతుంటే కార్ డ్యాష్ ఇవ్వబోగా ప్రేమ్ వచ్చి కాపాడతాడు.
కట్ చేస్తే... జ్వాల జరిగిన విషయాన్ని తలుచుకుంటూ హిమపై రగిలిపోతూ వుంటుంది. అదే సమయంలో హిమ నుంచి ఫోన్ రావడంతో నా జీవితంలో ఇద్దరు శత్రువులు వున్నారని వార్నింగ్ ఇస్తుంది. అదే సమయంలో సౌందర్య.. జ్వాల దగ్గరికి వెళ్లి "నీకు, నిరుపమ్ కు గొడవేంటి?" అని అడుగుతుంది. అప్పుడు "అంతా బాగుంటే నేను డాక్టర్ సాబ్ పెళ్లాన్ని అయ్యేదాన్ని" అని జ్వాల అనడంతో ఎమోషనల్ అయిన సౌందర్య.. జ్వాలని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ తరువాత ఏం జరిగింది?.. కథ ఎలాంటి మలుపులు తిరిగింది అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
